సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విరాటపర్వం సినిమాలో ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ నివేత పేతురాజ్ ను ఎంపిక చేశారట. ఈమె పాత్ర ఏంటీ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రానాకు ఈమెకు మద్య సీన్స్ ఉంటాయట, కాని అవి రొమాంటిక్ సీన్స్ కావు అంటున్నారు. హీరోయిన్ గా నటిస్తూనే ఈ అమ్మడు ఇలా ముఖ్య పాత్రలను గెస్ట్ రోల్స్ ను చేస్తోంది. నటిగా పేరు దక్కించుకునేందుకు ఈమె తాపత్రయ పడుతూ ఉంది. విరాటపర్వంలో నివేత పేతురాజ్ మరోసారి తన నటన ప్రతిభను కనబర్చే అవకాశం ఉంది.