ఇక నేడు రానా వివాహ నిశ్చితార్థంకు అంతా రెడీ అయ్యింది. ఈ సమయంలోనే ఈమె మరోసారి తనదైన శైలిలో కామెంట్ చేసింది. నేడు సాయంత్రం రానా నిశ్చితార్థం రామానాయుడు స్టూడియోలో జరుగనున్న నేపథ్యంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో.. రానా బావకు నేడు ఎంగేజ్మెంట్. రామానాయుడు స్టూడియోలో ఆయన ఎంగేజ్ మెంట్ తర్వాత నాదే అంటూ ఫన్నీ ఈమోజీని పోస్ట్ చేసింది. రానా తమ్ముడు అభిరామ్‌తో శ్రీరెడ్డి వ్యవహారం ఆమద్య కాలంలో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
అభిరామ్తోనే ఈమె ఇంకా ప్రేమలో ఉందా అంటూ తాజా పోస్ట్‌తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెతో సురేష్‌బాబు కుటుంబం అస్సలు ఒప్పుకోక పోవచ్చు. ఆమె సరదాగా సురేష్‌బాబు ఫ్యామిలీని టార్గెట్ చేసే విషయంలో అలాంటి పోస్ట్‌లు పెట్టి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంతోషకర సమయంలో వారిని ఇలా మానసికంగా హింసించడం భావ్యం కాదని కొందరు అంటున్నారు.