తాజాగా ట్విట్టర్‌లో ఓ అభిమాని… ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని రష్మిని ప్రశ్నించాడు. దానికి అందరిలా టైమ్ వచ్చినప్పుడు చెబుతానని కామన్ ఆన్సర్ ఇవ్వకుండా… ‘పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ అనే అర్థం. నా ప్రొఫెషనల్ విషయాల గురించి, కమ్యూనిటీ సర్వీస్ గురించి అడగండి చెబుతాను… మిగిలినవన్నీ నా పర్సనల్స్’ అంటూ ఫుల్లు క్లారిటీతో ఆన్సర్ ఇచ్చింది రష్మి. తన పెళ్లి గురించి, ప్రేమ వ్యవహారాల గురించి ఎవ్వరికీ చెప్పడం తనకి ఇష్టం లేదని అలాగే ఎవ్వరూ దాని గురించి ఆడగకూడదని కూడా సెలవిచ్చింది.
మరో ప్రక్కన లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వీధికుక్కలకు ఆహారం పెడుతోన్న రష్మి, కొందరు కమ్యూనిటీ సభ్యులతో కలిసి మూగజీవుల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సాధ్యమైనంత వరకు చాలామంది ఈ విధంగా కమ్యూనిటీ సేవ చేయాలని కోరుతోంది. ఇకపోతే రష్మి దగ్గర నుండి గ్లామర్ ట్రీట్ ఆశించేవారు మాత్రం మళ్ళీ జబర్ దస్త్ షూటింగ్ మొదలయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.