అయితే.. అతగాడి ప్రయత్నం అతిగా పలువురు తిట్టి పోస్తున్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. రష్మికను నేరుగా చూడాలన్న ఉద్దేశంతో ఒక వీరాభిమాని ఏకంగా 900 కి.మీ. ప్రయాణించి రష్మిక సొంతూరు వెళ్లాడు. కాకుంటే.. ఆమెను కలవకుండానే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. తెలంగాణకు చెందిన అకాశ్ త్రిపాఠికి రష్మిక అంటే పిచ్చి అభిమానం. ఆమెను నేరుగా కలవాలని భావించాడు.
అంతే.. మరేమీ ఆలోచించకుండా కరోనా విషయాన్ని పక్కన పెట్టేసి ఆమె సొంతూరు అయిన కర్ణాటక లోని కొడుకు జిల్లాకు చేరుకున్నారు. ఇందులో బాగంగా తెలుత తెలంగాణ నుంచి మైసూర్ కు ట్రైన్ లో వెళ్లిన అతడు.. ఆ తర్వాత సరకు రవాణా వాహనంలో రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు.
అక్కడకు చేరిన తర్వాత గూగుల్ సాయంతో ఆమె ఇంటిని వెతికే ప్రయత్నం చేశారు. అక్కడ కనిపించిన వారందరిని రష్మిక ఇల్లు ఎక్కడ? అంటూ అడగటం మొదలు పెట్టారు. స్థానిక పోలీసులకు ఇతగాడి ప్రవర్తన తేడాగా కనిపించటంతో అతడ్ని ప్రశ్నించారు. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోందని.. ఇలా రాకూడదని చెప్పిన పోలీసులు అతడ్ని వెనక్కి పంపారు. రష్మిక ఊళ్లో లేదని.. షూటింగ్ కోసం ముంబయి వెళ్లినట్లు చెబుతున్నారు. తన వీరాభిమాని పిచ్చి అభిమానంతో చేసిన పనికి ఎలా రియాక్టు అవుతారో?