తన కెరీర్ కొత్త మలుపు తిరుగుతోందన్న విషయాన్ని వెంటనే గ్రహించిన రష్మిక బ్యాక్ టు బ్యాక్ మసూపర్ స్టార్ మహేష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో రెండు క్రేజీ చిత్రాలని కూడా తన ఖాతాలో వేసుకుని పలువురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లకు షాకిచ్చింది. వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం `పుష్ప` చిత్రాలలో భాగంగా తొలి పార్ట్ గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమా ప్రచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాని పక్కా ప్లాన్ తో సిద్ధమైంది రష్మిక. ఈ చిత్రంలో డీ గ్లామర్ గా శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ఓవర్ డోస్ గ్లామర్ ని ఒలికిస్తూ యెద అందాలతో థై షో చేస్తూ చేసిన రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీతో కలిసి రష్మిక హైదరాబాద్ బెంగళూరు చెన్నై కేరళ. ముంబైల్లో జరిగిన ప్రెస మీట్లలో పాల్గొంది. ఒక్కో ప్రెస్ మీట్ కి ఒక్కో తరహాలో డ్రెస్సింగ్ చేసుకుని అక్కడి మీడియాని ఎట్రాక్ట్ చేయడంలో వారి అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో రష్మిక నూటికి నూరుశాతం సక్సెస్ అయింది.
ఓ ప్రెస్ మీట్ లో బ్లాక్ కలర్ శారీ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది. ఆ తరువాత బ్లాక్ కలర్ టూ పీస్ డిజైనర్ వేర లో కనిపించి థై షో చేస్తూ హల్చల్ చేసింది. ఆ తరువాత గ్రీన్ కలర్ లెహెంగా ధరించి గ్లామర్ అందాలని విందు చేస్తూ హోయలు పోయంది. అంతేనా స్టేజ్ పై పుష్పలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తూ వయ్యారాలు పోయింది. ఫైనల్ గా బ్లూకలర్ లెహెంగాడిజైనర్ వేర్ లో యెద అందాలని చూపిస్తూ ఫొటోలకి పోజులిస్తున్న సందర్భంలో కన్నగీటి కవ్వించినంత పని చేసింది.
ఇదంతా పాన్ ఇండియా స్థాయిలో తనపై అటెన్షన్ క్రియేట్ కావడం కోసమే రష్మిక ఈ స్థాయిలో రచ్చ చేసిందట. ఈ విషయం తెలిసిన వాళ్లంతా రష్మిక ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యిందిగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా బాలీవుడ్ ని ప్రసన్నం చేసుకోవడం కోసమేనని కామెంట్ లు వినిపిస్తున్నాయి.