Advertisement

పుష్ప ఎఫెక్ట్… శ్రీవల్లికి మరో బిగ్గెస్ట్ ఛాన్స్

Posted : January 18, 2022 at 6:57 pm IST by ManaTeluguMovies

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప కు జోడీగా శ్రీవల్లిగా నటించిన రష్మికకు కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తో ఆమె కెరీర్ మరింత జోరు పెరిగినట్లయ్యింది. ఇప్పటికే తెలుగు.. తమిళం.. కన్నడం మరియు హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మికకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్.. కొరటాల శివల కాంబో సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై చర్చ జరుగుతోంది. ఆలియా భట్ మొదలుకుని పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. పుష్ప సినిమా తో రష్మికకు మొత్తం దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. కనుక ఆమె నటిస్తే హిందీ మరియు ఇతర భాషల రైట్స్ కు మంచి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

రష్మిక మందన్నా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించింది. ఎన్టీఆర్ తో ఈమె చేయబోతున్న సినిమా ఈమె కెరీర్ కు మరింత కీలకంగా నిలవబోతుంది. పుష్ప సినిమా పార్ట్ 2 లో నటించడంతో పాటు ఎన్టీఆర్.. కొరటాల శివ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాలో కూడా ఈమె నటించడం వల్ల ఒకే సారి రెండు అతి పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఘనత ఈమెకు దక్కబోతుంది. రికార్డు స్థాయి లో పుష్ప సినిమా వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆమెకు ఎన్టీఆర్ సినిమా లోనే కాకుండా మరిన్ని సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివది జనతా గ్యారేజ్ సినిమాతో హిట్ కాంబోగా పేరు దక్కింది.

మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను ముగించి విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్న కొరటాల శివ తదుపరి సినిమా ను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లుగా అధికారికంగా చాలా నెలల క్రితమే ప్రకటించాడు. కాని ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బిజీగా ఉండటం.. తాను ఆచార్య సినిమా తో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇంతలో కరోనా వల్ల మళ్లీ షూటింగ్ వాయిదా పడింది. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను నందమూరి కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే కొరటాల శివ ఆ అంచనాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతటి అంచనాలున్న సినిమాలో రష్మిక నటించే అవకాశం దక్కించుకోవడం చాలా పెద్ద విషయం. మరి ఈ శ్రీవల్లి ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా తో కూడా సక్సెస్ దక్కించుకుంటుందా అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

Aadivaaram with StarMaa Parivaaram Starwars | Arjun Attackers vs Amardeep Warriors | Sun at 11AM

Posted : April 19, 2024 at 7:12 pm IST by ManaTeluguMovies

Aadivaaram with StarMaa Parivaaram Starwars | Arjun Attackers vs Amardeep Warriors | Sun at 11AM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement