రష్మిక మందన్నా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించింది. ఎన్టీఆర్ తో ఈమె చేయబోతున్న సినిమా ఈమె కెరీర్ కు మరింత కీలకంగా నిలవబోతుంది. పుష్ప సినిమా పార్ట్ 2 లో నటించడంతో పాటు ఎన్టీఆర్.. కొరటాల శివ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాలో కూడా ఈమె నటించడం వల్ల ఒకే సారి రెండు అతి పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఘనత ఈమెకు దక్కబోతుంది. రికార్డు స్థాయి లో పుష్ప సినిమా వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆమెకు ఎన్టీఆర్ సినిమా లోనే కాకుండా మరిన్ని సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివది జనతా గ్యారేజ్ సినిమాతో హిట్ కాంబోగా పేరు దక్కింది.
మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను ముగించి విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్న కొరటాల శివ తదుపరి సినిమా ను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లుగా అధికారికంగా చాలా నెలల క్రితమే ప్రకటించాడు. కాని ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బిజీగా ఉండటం.. తాను ఆచార్య సినిమా తో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇంతలో కరోనా వల్ల మళ్లీ షూటింగ్ వాయిదా పడింది. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను నందమూరి కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే కొరటాల శివ ఆ అంచనాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతటి అంచనాలున్న సినిమాలో రష్మిక నటించే అవకాశం దక్కించుకోవడం చాలా పెద్ద విషయం. మరి ఈ శ్రీవల్లి ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా తో కూడా సక్సెస్ దక్కించుకుంటుందా అనేది చూడాలి.