పుష్ప హీరోయిన్ రష్మిక కూడా అలాగే డీగ్లామ్ క్యారెక్టర్ చేస్తోందట. ఇంతవరకు రష్మిక చేసిన కేరక్టర్స్ అన్నీగ్లామర్ ప్రధాన పాత్రలే. ఆమెకి మేకప్ అధికంగా వేయడమే కాకుండా ఫోటోషాప్ కరెక్షన్స్ కూడా బాగానే చేస్తుంటారని టాక్.
మరి రష్మిక పూర్తిగా డీగ్లామరస్ పాత్రని కెరీర్లో ఇంత త్వరగా చేయడం సాహసమే అనుకోవాలి. సమంత అయినా అప్పటికి పెళ్ళైపోయి దాదాపుగా పెద్ద సినిమాలకి దూరమైన టైంలో అటెంప్ట్ చేసింది. కానీ రష్మిక కెరీర్ పీక్ కి వెళుతుండగా ఇలాంటి పాత్రని ఛాలెంజ్ గా తీసుకుంది.