గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC 16’ మూవీ షూటింగ్ లో ఉన్నారు. మైసూర్ లో ఈ మూవీకి సంబంధించి కీలకమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని బుచ్చిబాబు యాక్షన్ ఎపిసోడ్స్ లేదంటే సాంగ్స్ తో కాకుండా కామెడీ సన్నివేశాలతో మొదలెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కూడా ఉంది.
మైసూర్ లో జరుగుతోన్న షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్, సత్య, చమ్మక్ చంద్ర, జాన్ విజయ్ కూడా పాల్గొన్నారంట. జాన్ విజయ్ కి కామెడీ అండ్ కన్నింగ్ విలన్ గా సౌత్ లో మంచి పేరు ఉంది. అతని పెర్ఫార్మెన్స్ చాలా విభిన్నంగా ఉంటుంది. సత్య, చమ్మక్ చంద్ర కూడా షూటింగ్ లో పాల్గొన్నారంటే కచ్చితంగా కీలకమైన కామెడీ సీక్వెన్స్ ని తెరకెక్కించి ఉంటారని అందరూ భావిస్తున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ ‘RC 16’ మూవీలో మంచి కామెడీ ఉంటుందని, ఇప్పటి వరకు టచ్ చేయని ఎంటర్టైన్మెంట్ తో పాటు కామెడీని ఈ సినిమాలో చేస్తున్నట్లు ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బుచ్చిబాబు ఫస్ట్ షెడ్యూల్ ని కమెడియన్స్ తోనే మొదలుపెట్టడం ద్వారా ఈ సినిమాలో కచ్చితంగా కావాల్సినంత వినోదం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ కథని బుచ్చిబాబు చెప్పబోతున్నారు. ఈ సినిమా కోసం ఉత్తరాంధ్రకి చెందిన యాక్టర్స్ ని ఆడిషన్స్ చేసి ఎంపిక చేశారు. ఉత్తరాంధ్ర నేటివిటీకి తగ్గట్లుగానే హైదరాబాద్ లో ప్రత్యేకమైన విలేజ్ సెట్ కూడా వేశారంట. అలాగే రామ్ చరణ్ ఉత్తరాంధ్ర స్లాంగ్ ని ఈ సినిమా కోసం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు అయితే ‘RC 16’ సినిమాతో ఏదో డిఫరెంట్ కథని తెరపై ఆవిష్కరించబోతున్నాడని అనుకుంటున్నారు.
మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువ హైప్ ‘RC 16’ మూవీపైన ఉంది. వచ్చే ఏడాది ఆఖరులో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘RC 17’ చిత్రాన్ని రామ్ చరణ్ స్టార్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది వేచి చూడాలి.