ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చిన రెడ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం రెడ్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం థియేటర్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో రెడ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

రామ్ ట్విట్టర్ లో రెడ్ రిలీజ్ పై అధికారిక సమాచారం ఇచ్చాడు. రెడ్ సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించారు. అలాగే డిసెంబర్ 24న రెడ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుందని ప్రకటించాడు.

ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ ద్విపాత్రాభినయం పోషించిన సినిమా రెడ్. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే రెడ్ లోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి రెడ్ అంచనాలను ఏమాత్రం అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version