Advertisement

ముద్దు, కౌగిలింత‌లు వ‌ద్దే వ‌ద్దంటున్న బ్యూటీ

Posted : June 30, 2020 at 8:29 pm IST by ManaTeluguMovies

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో కూడా ముద్దులు, కౌగిలింత‌లకు పాల్ప‌డే వారిని చూశాం. నాలుగ్గోడ‌ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన వాటిని కూడా ఏ మాత్రం భ‌యం లేకుండా ప‌బ్లిక్‌గా ప్ర‌ద‌ర్శించ‌డంపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా మార‌ని వైనాన్ని చూశాం. కానీ దేవునికైనా దెబ్బే గురువ‌ని…క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని షేక్ హ్యాండ్ ఇవ్వాల‌న్నా భ‌య‌ప‌డి చ‌స్తున్నారు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా బుల్లితెర‌, వెండితెర షూటింగ్‌ల్లో కూడా మార్పు చేసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ముద్దూ ముచ్చ‌ట్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వ‌స్తోంది. ప్ర‌ముఖ హీరోయిన్ రెజీనా క‌సాండ్రా సినిమాల్లో రొమాన్స్ సీన్స్‌పై త‌న‌దైన అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతోంది.

భ‌విష్య‌త్‌లో తాను చేసే సినిమాలలో ఇంటిమేట్ సీన్స్ చేయనని స్ప‌ష్టం చేసింది. లిప్‌లాక్స్, హగ్స్, రొమాన్స్ సీన్స్‌లో న‌టించా లంటే త‌న భ‌యాన్ని వ్య‌క్తం చేసింది. అందుకే అలాంటి వాటి జోలికి పోన‌ని తేల్చి చెప్పింది. క‌రోనా పూర్తిగా తుడిచిపెట్టుకు పోతే త‌ప్ప హ‌గ్స్‌, లిప్‌లాక్స్‌, ఇత‌ర‌త్రా ఏమైనా సీన్స్‌లో న‌టించేందుకు అంగీక‌రించే ప్ర‌శ్నే లేద‌న్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు ఇలాంటి అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు. మ‌నిషిని మ‌నిషి న‌మ్మ‌లేని ప‌రిస్థితిని క‌రోనా సృష్టించింది. దీంతో ఏ రూపంలో ఎలాంటి ప్ర‌మాదం ముంచుకొస్తుందో అనే భ‌యంతో సాధ్య‌మైనంత వ‌ర‌కు ఫిజిక‌ల్ డిస్టెన్స్ పాటించేందుకు న‌టీన‌టులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.


Advertisement

Recent Random Post:

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి | Israel-Iran Tensions | Iran Fires Over 300 Drones, Missiles At Israel

Posted : April 14, 2024 at 8:27 pm IST by ManaTeluguMovies

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి | Israel-Iran Tensions | Iran Fires Over 300 Drones, Missiles At Israel

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement