విచారణలో భాగంగా కొన్ని సాక్ష్యాధారాలను కూడా నార్కోటిక్స్ అధికారులు పొందినట్టు వార్తలు వస్తున్నాయి. రియా ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకోగా అన్నీ రిజెక్ట్ అయ్యాయి. ఇటీవలే ఎన్డీపీఎస్ కోర్టు రియా చక్రవర్తి కస్టడీను అక్టోబర్ 21 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే బొంబాయి హై కోర్టు ఈరోజు రియాకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1 లక్ష రూపాయల పూచికత్తుపై ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే రియా సోదరుడు శౌయిక్ కు మాత్రం బెయిల్ రిజెక్ట్ అయింది.