తాజాగా ఓ 25 ఏళ్లు వెనక్కి వెళ్లారు. ఆ మధుర జ్ఞాపకాల్లో విహరిస్తూ ఆనంద పారవశ్యంలో తేలియాడారు. 1995లో తాను పాల్గొన్న మొదటి ఫొటో అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాటి తీపి గుర్తులకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
“1995, సెప్టెంబర్ 9.. మొదటిసారి నేను కెమెరా ముందుకొచ్చాను. అప్పుడే పాతికేళ్లు పూర్తయ్యాయి. నిజానికి నేను అంతరిక్ష శాస్త్రవేత్త లేదా డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. కానీ, విధి నా జీవితాన్ని మరోలా ప్లాన్ చేసింది.16 ఏళ్ల వయసులో అనుకోకుండా నేను కెమెరా ముందుకొచ్చాను. సినిమాలతో ప్రేమలో పడిపోయిందప్పుడే. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాసాలో జాయిన్ అయి శాస్త్రవేత్త కావాలనుకున్న నా కలను వదులుకోవాల్సి వచ్చినపుడు చాలా బాధపడ్డాను. ఆ బాధ చాలా ఏళ్లు నన్ను వెంటాడింది” అని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో రేణూదేశాయ్ పోస్టు పెట్టారంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుంది. ఈ పోస్టు కూడా ఎంతో ప్రత్యేకమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.