ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కోపం తగ్గించుకోండి అన్నయ్య… రేణుదేశాయ్ పంచ్

రేణుదేశాయ్… కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటోంది. మొన్నామధ్య అకీరా పుట్టినరోజున చిరూ, చరణ్‌లు సోషల్ మీడియా ద్వారా విష్ చేసినా, నేరుగా స్పందించలేదు. అలాంటి రేణుదేశాయ్… నేడు పవన్ కల్యాణ్‌తో కలిసి ఉన్న ఫోటోలను వరుసగా పోస్ట్ చేసింది. తన మొదటి సినిమా గురించి, పవన్ కల్యాణ్‌తో ఏకాంతంగా గడిపిన ఆనాటి క్షణాల గురించి అభిమానులతో పంచుకుంది.

దీంతో పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘ఈ రేణుదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు… ఆ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మళ్లీ ఈ పోస్ట్‌లు ఎందుకు? ఎంగేజ్‌మెంట్ అయ్యింది కదా… ఆ విషయం ఏమైంది?’ అంటూ ఓ పవన్ అభిమాని పోస్ట్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన రేణు దేశాయ్, అతనికి గట్టి పంచ్ ఇచ్చింది.

‘అవసరమా… అంటే అవును అవసరం. బద్రీ వచ్చి నేటికి 20 ఏళ్లు. ఈ సినిమాను చాలామంది మరిచిపోయారు. కాని ఇది నా మొదటి సినిమా… నాకు చాలా చాలా స్పెషల్. ఇంత ద్వేషం ఎందుకు అన్నా… మనం ఇప్పటికే ఈ వైరస్ వల్ల చాలా కష్టాల్లో ఉన్నాం. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అందరికోసం కాస్త మంచిగా ఆలోచించండి…’ అంటూ క్లియర్‌గా తెలుగులో రాసుకొచ్చింది రేణు దేశాయ్.

కేవలం మూడు సినిమాల్లోనే నటించిన రేణు దేశాయ్‌కి తన మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే పవన్‌‌కు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రేణూ… ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడమే మంచిదంటున్నారు ఫ్యాన్స్. పట్టించుకుంటూ పోతే పీకే ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ టైమ్ వేస్ట్ చేయాల్సి ఉంటుంది.

Exit mobile version