ఇలాంటి నేపథ్యంలో ఆయన నటుడు పృధ్వీని పిలిచి స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ టెస్ట్ చేయాల్సినంత పాత్ర ఏమిటి? పృధ్వీతో ఆర్జీవీ ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి వుంది. ఆర్జీవీ మదిలో చాలా సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి.
హైదరాబాద్ దాదాస్ అంటూ పాతబస్తీ, నిన్నటి తరం రౌడీల మీద సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. అదే విధంగా ‘ఆ ఇంట్లో ఏం జరిగింది?’ అనే ఒక సంచలన సినిమా ప్లానింగ్ లో వుందని తెలుస్తోంది. మరి ఈ కథలో ఒక హీరో క్యారెక్టర్ వుందని, దానికి పృధ్వీ సూట్ అవుతారనే ఉద్దేశంతో స్క్రీన్ టెస్ట్ చేసి వుండొచ్చని వినిపిస్తోంది. కాదు,, వేరే క్యారెక్టర్ కోసం అని కూడా వినిపిస్తోంది.
మొత్తానికి ఆర్జీవీ సినిమాతో పృధ్వీ మళ్లీ టాలీవుడ్ లో హల్ చల్ ప్రారంభిస్తారేమో?