పవన్ కళ్యాణ్ పై ‘పవర్ స్టార్’ అనే చిత్రాన్ని వర్మ తీస్తున్నాడు. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ట్రైలర్‌ను కూడా డబ్బులు ఇచ్చి చూడాల్సిందే అంటూ వర్మ పోస్ట్ చేశాడు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తానంటూ ప్రకటించిన వర్మ దాన్ని చూడాలంటే మాత్రం 25 రూపాయలు చెల్లించాల్సిందే అంటున్నాడు. ప్రపంచంలోనే ట్రైలర్ కు కూడా డబ్బులు వసూళ్లు చేసేది తానే అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడు.
యూట్యూబ్‌లో ట్రైలర్ చూడాలంటే రూ.25 చెల్లించాలంటూ వర్మ సినిమాకు ఎంత రేటు పెడుతాడో అంటూ జనాలు అప్పుడే చర్చించుకుంటున్నారు. ఈమద్య కాలంలో వర్మ అన్ని కూడా తన డిజిటల్ థియేటర్లో విడుదల చేస్తున్నాడు. కనుక ఆయన పవర్‌స్టార్ మూవీని కూడా అలాగే విడుదల చేయబోతున్నాడు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పరిస్థితి ఎలా మారాయి అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాను అంటూ వర్మ పదే పదే చెబుతున్నాడు. పవన్‌తో పాటు చంద్రబాబు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు అంటూ పోస్టర్స్ ద్వారా హింట్ ఇచ్చాడు.