ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వర్మపై సినిమా తీసేంత సీనుందా?

మొండివాడు రాజుకన్నా బలవంతుడు. కానీ వర్మ మొండిగాడి కన్నా బలవంతుడు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు అనే టైపు అతగాడు. ఆయన అందరినీ కెలుకుతాడు. కానీ అలా కెలికించుకున్న వాళ్లు మాత్రం, ఆయనను కెలకడం ఎందుకు? అనవసరంగా ఆయనకు, ఆయన సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వడం తప్పిస్తే అనే సాకు చెప్పుకుని, సర్ది చెప్పుకుని దూరంగా వుంటారు. దాంతో ఆయన మరింత రెచ్చిపోతుంటాడు.

ఇలాంటి టైమ్ లో వర్మ కేనా సినిమాలు తీయడం వచ్చింది. మనమూ తీద్దాం అని చాలా మంది అనుకున్నారు తప్ప, గట్టిగా ముందుకు వెళ్లలేకపాయారు. ఆ మధ్య కవి జొన్మవిత్తులు గట్టిగా సంకల్పించుకుని, మాగ్నమ్ ఫిలింస్ బ్యానర్ మీద ఆర్జీవీ అనే పేరుతో సినిమా తీద్దాం అనుకున్నారు.

చిత్రంగా తెలుగు సినిమా ఛాంబర్ నే టైటిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్ జి వి అనే టైటిల్ ఇవ్వం కాక ఇవ్వం అని చాంబర్ ప్రతినిధి దామోదర ప్రసాద్ (దాము) అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. అంటే ఇండస్ట్రీ ఆర్జీవీ వెనుక వుందా? మెగా క్యాంప్ వెనుక వుందా? అన్న చిన్న సందేహం? రేపు పవర్ స్టార్ అనే టైటిల్ అడిగితే ఇస్తారేమో కానీ ఆర్జీవీ టైటిల్ మాత్రం ఇవ్వలేదు. సరే, జొన్నవిత్తుల అండ్ కో వాళ్ల బాధలేవో వాళ్లు పడ్డారు. ఈలోగా కరోనా వచ్చింది.

ఇప్పుడు పవన్ ఫ్యాన్ నూతననాయుడు పరాన్నజీవి అనే సినిమా ప్రకటించారు. ప్రకటించడం వరకు ఓకె,. కానీ చేయడం అంటే అంత వీజీ కాదు. వర్మ దగ్గర తెగింపు ఒకటే బయటకు కనిపిస్తోంది. కానీ వర్మ దగ్గర మేకంగ్ కూడా వుంది. విషయం లేకపోయినా, పోలిక వున్న నటులను పట్టుకోవడం, ధైర్యంగా పేరు పెట్టి సినిమా తీయడం, ఇలా చాలా వున్నాయి. ఇలాంటి వ్యవహారాలు అందరూ చేయలేరు.

నూతన్ నాయుడు సినిమా తీయడం కోసం ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రామినెంట్ ఫిగర్ ను నటించమని అడిగారు. కానీ నో అన్నాడు ఆ వ్యక్తి. వర్మ మీద ఇండస్ట్రీకి పీకల మటుకు కోపం వుంటే ఎస్ అనాలి.కానీ నో అన్నాడుగా. ఎందుకని?

అదీ కాక కోపంతో సినిమా తీయాలనుకోవడం వేరు. క్రియేటివ్ బ్రెయిన్ తో సినిమా తీయడం వేరు. వర్మ దగ్గర అవసరం, క్రియేటివ్ బ్రెయిన్,తెగింపు అన్నీ వున్నాయి. అలా ఎవరైనా వుంటే వాళ్లు మాత్రమే రామ్ గోపాల్ వర్మ అని పెరు పెట్టి మరీ సినిమా తీయగలరు. అంత వరకు వర్మ హవా అలా సాగుతూ వుంటుంది.

Exit mobile version