ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆర్జీవీ ‘పవర్‌స్టార్‌’కి వాళ్ళే రాజపోషకులు.?

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్ గోపాల్‌ వర్మ ‘పవర్‌ స్టార్‌’ సినిమాని ఎవరి మీద తీస్తున్నాడో అందరికీ తెలుసు. కానీ, ఎవరి మీద ఆ సినిమా చేస్తున్నానని చెప్పే ధైర్యం ఆయనకి లేదు. ‘ఇది పూర్తిగా కల్పితం.. ఇందులో పాత్రలేవీ ఎవర్నీ ఉద్దేశించినవి కావు..’ అని ఆయన కుండబద్దలుగొట్టేస్తున్నాడు. మరోపక్క, ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదికగా తన సినిమాని ప్రమోట్‌ చేసుకునే క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ఫొటోల్ని కూడా విపరీతంగా వాడేస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారానికి వైసీపీ మద్దతుదారులతోపాటు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల నుంచీ పూర్తి మద్దతు లభిస్తోంది. నిజమేనా.? ఎన్టీఆర్‌ అభిమానులకి పవన్‌ కళ్యాణ్‌ మీద అంత వ్యతిరేకత వుందా.? అంటే, యంగ్‌ టైగర్‌ అభిమానుల ముసుగులో టీడీపీ అభిమానులే ఇదంతా చేస్తున్నారన్నది ఇంకో వెర్షన్‌.

సోషల్‌ మీడియాలో ఎంకరేజ్‌మెంట్‌ వరకూ బాగానే వుందిగానీ.. ఒక్కసారి సినిమా (దీన్ని సినిమా అనాలా.?) విడుదలయ్యాక, దాన్ని ఎంతమంది చూస్తారు.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ‘రిలీజ్‌కి ముందు బుక్‌ చేసుకుంటే ఒక రేటు, రిలీజయ్యాక బుక్‌ చేసుకుంటే ఇంకో రేటు..’ అంటున్నాడు ఆర్జీవీ. ఆన్‌లైన్‌లో ఈ సినిమా కోసం 100 రూపాయలైనా ఖర్చుపెట్టేవాళ్ళెంతమంది.? 150 రూపాయల పైనే టిక్కెట్‌ పెట్టేశాడు ఆర్జీవీ.. ఇది సినిమా రిలీజ్‌కి ముందు మాత్రమే. రిలీజయ్యాక రేటు రూ.250 కి పెరుగుతుందట. మొన్నటికి మొన్న ట్రైలర్‌ని అమ్మేద్దామనుకున్నాడు.. పబ్లిసిటీ స్టంటు చేసి ఫ్రీగా వదిలేశాడు. ఇప్పుడు సినిమా విషయంలో ఏం జరుగుతుందో.! ‘అసలు సినిమా కంటే ముందే లీక్‌ వీడియో వచ్చేస్తుంది..’ అన్న ధీమాతో వున్నారు చాలామంది.. వీళ్ళలో ఇప్పటిదాకా ఆర్జీవీని వెనకేసుకొస్తున్నవాళ్ళే ఎక్కువమంది కావడం గమనార్హం.

నిజానికి, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులెవరూ ఈ ఆర్జీవీ ‘పవర్‌స్టార్‌’ని పట్టించుకోవడంలేదు. పబ్లిసిటీ కోసం ఏం చేయడానికైనా వెనుకాడని వర్మ, ఓ టీమ్ ని తయారుచేసి.. పవన్‌ అభిమానుల్లా వారిని పేర్కొంటూ, వారితోనే తిట్టించుకుంటున్నాడన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.. ఎందుకంటే, అది ఆర్జీవీ కళాఖండం మరి. నమ్మితే వైసీపీ అభిమానులైనా, యంగ్‌ టైగర్‌ అభిమానులైనా నట్టేట్లో మునిగినట్లే.

Share

Exit mobile version