Advertisement

పవన్, మహేష్, రవితేజలను క్రాస్ చేస్తే విజయ్ దేవరకొండ

Posted : July 20, 2021 at 11:28 am IST by ManaTeluguMovies

రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పేదేముంది. ఎవరినైనా పొగడాలి అనుకుంటే ఎవరెస్ట్ ఎక్కిస్తాడు. ట్రోల్ చేయాలి అంటే పాతాళంలోకి పడేస్తాడు. ఈసారి విజయ్ దేవరకొండపై తన దృష్టిని పెట్టాడు.

“లైగర్ సినిమా చూసాను. టైగర్, లయన్ క్రాస్ కంటే ఎక్కువ. చూస్తుంటే విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ల ష్రాఫ్ ల సూపర్ క్రాస్ అనిపిస్తోంది.” అని ట్వీట్ చేసాడు. అంతటితో ఆగిపోలేదు.

“విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజన్స్ గత రెండు దశాబ్దాలలో నేను చూసిన స్టార్ ల స్క్రీన్ ప్రెజన్స్ కంటే గొప్పగా ఉంది. ఇలాంటి సినిమా ఇస్తున్నందుకు పూరి జగన్నాథ్, ఛార్మిలకు చాలా థాంక్స్.” అని ట్వీట్ చేసాడు.

లైగర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లో లైగర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారింది | MLA Komatireddy Rajagopal Reddy arrested |

Posted : July 29, 2021 at 11:48 am IST by ManaTeluguMovies

చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారింది | MLA Komatireddy Rajagopal Reddy arrested |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement