ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజ్ కుంద్రా కేసుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. ఆయన ఏం మాట్లాడినా అది సంచలనే అవుతుంది. ఎలాంటి అంశంపైనా అయినా తనదైన శైలిలో వర్మ పేల్చే పంచులు వైరల్ అవుతుంటాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న అంశం రాజ్ కుంద్రా కేసుయే. ఇందులో ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉండంతో వర్మ కూడా ఈ వివాదంపైస్పందించారు.

గతంలో ఇదే వర్మ అశ్లీల తార ‘మియా మాల్కోవా’తో కలిసి జీఎస్టీ అనే సినిమా తీసి సంచలనం సృష్టించాడు. నాటికి నేటికి మారిన పరిస్థితులు రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత మార్పులపై వర్మ స్పందించాడు.

రాజ్ కుంద్రా కేసు గత వారం నుంచి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కేసులో రాజ్ కుంద్రా ఇరుక్కుపోయారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్నా కూడా వదలకూడదని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కొంతమంది అగ్ర నటీనటులు కూడా ఇందులో విచారణకు రెడీ అవుతున్న వేళ వర్మ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

తాజాగా వర్మ ‘అశ్లీలం’పై చట్టాలపై వివరణ ఇచ్చారు. ముందు అశ్లీల వీడియోలను వారికి నచ్చి చూసుకుంటే తప్పు లేదని.. కానీ మరొకరికి ఇష్టం లేకపోయినా కూడా చూపించి దాన్ని బిజినెస్ చేసుకుంటే మాత్రం తప్పని వర్మ అన్నారు. రాజ్ కుంద్రా కేసుపై తనకు ఇంకా క్లారిటీ లేదని.. కాకపోతే అతడిపై బలవంతంగా అశ్లీల సినిమాలు షూట్ చేవారనే కేసు తీవ్రమైనదే అని అన్నారు. అది క్రైమ్ చేసినట్లేనన్నారు.

ఇక ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ ఎక్కువైందనే వివాదం కూడా కరెక్ట్ కాదని.. కేవలం వాటి వల్ల చెడిపోతున్నారని అనడం కూడా సరైంది కాదని వర్మ స్పష్టం చేశారు. ఓటీటీ కంటెంట్ లో హాట్ నెస్ ఎక్కువ అయ్యిందన్నప్పుడు చూసేవాడికి ఎన్నో వెబ్ సైట్స్ ఉన్నాయని.. ఎవరూ ఎవరిని చూడవద్దు అనడానికి రూల్ లేదని అన్నారు. చూసేవాడు ఎలాగైనా చూస్తాడని.. ఓటీటీలో ఎవరూ కూడా కేవలం అలాంటి వీడియోల కోసం చూడరు అని వర్మ క్లారిటీ ఇచ్చారు. కంటెంట్ లో అది కూడా ఒక భాగం కాబట్టి చూస్తారు అని ఆర్జీవీ తెలిపారు.

నేను మియా మాల్కోవాను ఒప్పించి ఆమె ఒప్పుకున్నాకే ఆ యాంగిల్ లో సినిమా తీశాను.. ఇష్టం ఉన్న వాళ్లు చూస్తారు.. లేదంటే లేదు.. నేను చేసింది లీగల్ అని వర్మ తన విషయంలో స్పష్టతనిచ్చారు. మీరు షూట్ చేయడానికి మీరు ఉంచుకోవడానికి ఇండియాలో లీగర్.. అయితే దాన్ని వేరే వాళ్లకు చూపించి బిజినెస్ చేస్తే మాత్రం చట్టవిరుద్ధం అని వర్మ అన్నారు. అప్పుడు కేసు పెట్టొచ్చని అన్నారు.

నేను జీఎస్టీ తీసినప్పుడు దానికి అమెరికన్ ప్రొడ్యూసర్.. నేను దర్శకుడిని మాత్రమే.. దానికి నాకు ఎలాంటి బిజినెస్ లింక్స్ లేవు. ఎవరికైతే నచ్చుతుందో వాళ్లతో మాత్రమే తాను ఆ కంటెంట్ ను షేర్ చేసుకున్నానని వర్మ ఈ వివాదంపై మాట్లాడారు.

Exit mobile version