ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళిల గడ్డంపై ఆర్జీవీ కామెంట్స్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా చాలా స్పెషల్ గా ఉంటుంది… ఏం మాట్లాడినా కూడా సంచలనమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో పబ్లిక్ ఈవెంట్ లో కనిపించలేదు. ఎట్టకేలకు ‘కనబడుట లేదు’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్టేజ్ కింద ఉన్న వారికి.. స్టేజ్ పైన ఉన్న వారికి అందరికి నమస్కారం పెట్టడం లేదు.. ఎందుకంటే నాకు నమస్కారం పెట్టిన నచ్చదు.. నేను ఎవరికి నమస్కారం పెట్టను. నా పద్దతిన నేను ఉంటాను. కనబడుట లేదు అంటున్నారు.. సినిమా ఇంత బాగా కనబడుతుంది.. తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇదే కార్యక్రమానికి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తండ్రి అయిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ హాజరు అయ్యారు.

విజయేంద్ర ప్రసాద్ మొదట మాట్లాడుతూ.. ఒకప్పటి ఆర్జీవీ ఇప్పుడు కనబడటం లేదు. శివ.. సత్య.. సర్కార్ వంటి ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కనబడటం లేదు అంటూ వర్మను ముందు ఉంచుకుని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ ఏం పడుతుందా అంటూ అంతా ఆసక్తిగా చూశారు. కాని వర్మ మాత్రం ఆ విషయం ను పెద్దగా పట్టించుకోకుండా విజయేంద్ర ప్రసాద్ పెంచుతున్న గడ్డం గురించి కామెడీగా మాట్లాడాడు. వర్మ మాట్లాడిన ఆ మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా రాజమౌళిని కూడా ఉద్దేశించి ఈ గడ్డం వ్యాఖ్యలను వర్మ చేయడం వల్ల అక్కడున్న వారు అంతా కూడా గట్టిగా నవ్వారు.

వర్మ మాట్లాడుతూ.. చాలా రోజులుగా మిమ్ములను ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. మీరు గడ్డం పెంచడానికి ఇన్సిపిరేషన్ నరేంద్ర మోడీనా.. రవీంద్రనాథ్ ఠాగూర్ నా అంటూ ప్రశ్నించారు. రామాయణం వంటి అద్బుతాన్ని రాశారు కనుక వాల్మీకి లా మీరు గడ్డం పెంచారా లేదంటే బోడి నా కొడుకు రాజమౌళినే గడ్డం పెంచాడు. నాది అంతకు మించి ఉండాలని పెంచారా.. నా అంచనా మాత్రం రాజమౌళి ని మించి పెంచాలని పెంచారేమో అనిపిస్తుంది అన్నాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ కు అక్కడ ఉన్న వారు అంతా కూడా గట్టిగా నవ్వేశారు. వర్మ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ స్పందించాలని అక్కడున్న కొందరు గట్టిగా అరిచారు. కాని విజయేంద్ర ప్రసాద్ నవ్వేసి ఊరుకున్నాడు.

Exit mobile version