Advertisement

‘అన్ స్టాపబుల్’ షోకి వెళ్తే ఆర్జీవీ చెంప చెళ్లుమనడం గ్యారెంటీనా..?

Posted : January 21, 2022 at 3:38 pm IST by ManaTeluguMovies

నటసింహం నందమూరి బాలకృష్ణ ”అన్ స్టాపబుల్” టాక్ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ కోసం చేసిన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. వెండితెరపై అఖండమైన విజయం సాధించిన బాలయ్య.. ఓటీటీలోనూ తన హోస్టింగ్ ‏తో సంచలనం సృష్టిస్తున్నాడు. సినిమాల్లో భారీ డైలాగ్స్ తో అలరించే సీనియర్ హీరో.. ఈ షోకి గెస్టులుగా వచ్చే సినీ ప్రముఖులను తనదైన శైలిలో చలాకీ ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయడం.. ఫన్నీ గేమ్స్ తో వారిని ఆడుకోవడం వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో టాక్ షోలు హోస్ట్ చేసినా.. బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు వచ్చిన రెస్పాన్స్ రాలేదని చెప్పడంతో అతిశయోక్తి లేదు. బాలకృష్ణలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగుతున్న ఈ ప్రోగ్రామ్.. IMDBలోని టాప్-10 రియాలిటీ టీవీ కార్యక్రమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఆహా’ ఓటీటీకి సబ్ స్క్రైబర్స్ కూడా భారీ స్థాయిలో పెరిగారని తెలుస్తోంది.

బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో మోహన్ బాబు – బ్రహ్మనందం – అనిల్ రావిపూడి – బోయపాటి శ్రీను – శ్రీకాంత్ – ప్రగ్యా జైస్వాల్ – అల్లు అర్జున్ – రష్మిక – సుకుమార్ – రవితేజ – గోపిచంద్ మలినేని – రాజమౌళి – కీరవాణి – రానా దగ్గుబాటి – విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ – ఛార్మి వంటి పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలో స్టార్ హీరో మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ”అన్ స్టాపబుల్ విత్ NBK” టాక్ షోపై ప్రశంసలు కురిపించారు. ఈ షో తనకు విపరీతంగా నచ్చిందని పేర్కొంటూ.. బాలయ్య అవకాశం ఇస్తే వెళ్లాలనే కోరికను వెలిబుచ్చారు. ”నేను ‘అన్ స్టాపబుల్’ ను స్ట్రాటో కంటే ఎత్తుగా ఉండే అంత ఎక్కువ లవ్ చేస్తున్నాను. నేను ఆ షోకు వెళ్లాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారు నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను” అని ఆర్జీవీ ట్వీట్5వేదికగా రిక్వెస్ట్ చేసారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఆ ట్వీట్ డిలీట్ చేశారు.

ఆర్జీవీ కి బాలకృష్ణ అవకాశం ఇస్తారో లేదో అనేది పక్కన పెడితే.. ఒకవేళ వీరిద్దరూ కలిసి చేస్తే మాత్రం ఆ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ‘అన్ స్టాపబుల్’ వేదికగా రాంగోపాల్ వర్మ చెంప పగలడం గ్యారంటీ అని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే తనకు నచ్చినట్లు బతికే ఆర్జీవీ ఇంటర్వ్యూలలో తిక్క తిక్క సమాధానాలు చెబుతూ ఉంటారు. హోస్ట్ ఎంత పెద్దవాడైనా మనసులో ఏది అనుకుంటే అది మొహమాటం లేకుండా అనేసే రకం.

మరోవైపు బాలకృష్ణ కూడా భావోద్వేగాలను మనసులో దాచుకునే వ్యక్తి కాదు. ఉన్నది ఉన్నట్టు.. ఏదైనా మొహాన్ని అడిగేస్తుంటారు. సహనం కోల్పోతే మాత్రం వెంటనే అవతలి వ్యక్తిని దూసిస్తూ చెంప చెళ్లుమనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు బాలయ్య టాక్ షోకు ఆర్జీవీ అతిథిగా వచ్చి.. న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తిక్క తిక్క జవాబులు చెబితే మాత్రం.. నటసింహానికి తిక్కరేగి వర్మ చెంప పగలగొట్టినా కొడతాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి హోస్ట్ బాలయ్య ‘అన్ స్టాపబుల్’ సీజన్-2 లో అయినా ఆర్జీవీ కోరికను మన్నించి గెస్టుగా పిలుస్తారేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Satyabhama Glimpse | Kajal Aggarwal | Sashi Kiran Tikka | Suman Chikkala | Sri Charan Pakala

Posted : April 18, 2024 at 11:02 pm IST by ManaTeluguMovies

Satyabhama Glimpse | Kajal Aggarwal | Sashi Kiran Tikka | Suman Chikkala | Sri Charan Pakala

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement