అయితే వర్మలోని క్రియేటివ్ జ్యూస్ మొత్తం అయిపోయిందో మరొకటో కానీ తనలో క్రియేటివిటీ తగ్గి కాంట్రవర్సీ పెరిగింది. పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. వర్మ ఏం చేస్తే అదే పబ్లిసిటీ అనే స్థాయి నుండి, పబ్లిసిటీ కోసం వర్మ ఏదైనా చేస్తాడు అనే దాకా వచ్చింది పరిస్థితి.
మొదట్లో వర్మ పాచికలు పారేవి. పబ్లిసిటీ జిమ్మిక్ కు పడిపోయేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వర్మ ఏం చేసినా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. దానికి నిదర్శనం కొండా చిత్రం. ఈ సినిమా కోసం వర్మ చేయని కాంట్రవర్సీ అంటూ లేదు కానీ ఆడియన్స్ పట్టించుకుంటున్న పాపాన పొవట్లేదు.