ఇక ఆర్జీవీ సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సంఘటనలపై స్పందిస్తారు. ముఖ్యంగా క్రైమ్ న్యూస్ అంటే ఈ డైరెక్టర్ కు బాగా ఇష్టం. అంతేస్థాయిలో పోలిటికల్ రంగంపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తారు. తాజాగా దేశంలో దుమారం రేపుతోన్న ‘హిజాబ్’ వివాదంపై వర్మ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హిజాబ్ పై వర్మ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు.
‘హిజాబ్ వివాదంలో పెద్ద సమస్య ఏమిటంటే దుస్తులను ఆయుధాలుగా మార్చడం.. రెండు మతాల మధ్య ఘర్షణాత్మక అంశాలపై ఇప్పటికే ఉన్న సుదీర్ఘ వివాదాలకు దాన్ని జోడించడం’ అని వర్మ హిజాబ్ వివాదంపై తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
‘హిజాబ్ వంటి నిర్దిష్ట దుస్తులను ధరించడం వివక్షగా అనిపించవచ్చు కానీ అదే సమయంలో ప్రత్యేకంగా నిలబడటం అనేది పరధ్యానంగా మారవచ్చు విశ్వాసం ప్రైవేట్గా ఆచరించాలి.. ప్రచారం చేయకూడదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది.’అని వర్మ తనదైన శైలిలో హితబోధ చేశాడు.
ఫ్రాన్స్ దేశంలో హిజాబ్ అబ్దుల్ ముతి అల్-బయ్యూమిని నిషేధించినప్పుడు అత్యంత గౌరవనీయమైన మతగురువు నిషేధానికి మద్దతు ఇచ్చాడు. “నిఖాబ్కు ఇస్లాంలో ఎటువంటి ఆధారం లేదు. కొంతమంది సోదరీమణులు (ఫ్రాన్స్లో) నిఖాబ్ ధరించడం చూసినప్పుడు నేను నిరాశ చెందాను. ఇది ఇస్లాం మతంపై మంచి అభిప్రాయాన్ని కలిగించదు” అని వర్మ షాకింగ్ ట్వీట్స్ చేశాడు.
యూనిఫాం డ్రెస్ అనేది అందరినీ ఒక్కగాటిన కట్టడానికి ఏకీకృతం చేస్తుంది. అయితే అది విద్యార్థి యొక్క నిజమైన స్వభావాన్ని దాచిపెడుతుందని కూడా వాదించవచ్చు. ఎందుకంటే ఒకరు ధరించడానికి ఎంచుకున్నది స్వీయ వ్యక్తీకరణ మరియు ప్రజాస్వామ్యంలో అది ప్రాథమిక హక్కు అని వర్మ ఈ సీరియస్ వివాదంపై తన మనోభావాలను వెల్లడించారు.