ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

వర్మ ‘మర్డర్‌’ పోస్టర్‌ చూసి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది

రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. నిన్న ఫాదర్స్‌ డే సందర్బంగా అమృత ప్రణయ్‌ల ప్రేమ కథ మరియు మారుతి రావు ఆత్మహత్యకు సంబంధించిన సినిమా ‘మర్డర్‌’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశాడు. చాలా కాలం క్రితమే రామ్‌ గోపాల్‌ వర్మ ఈ ప్రేమ కథపై సినిమాను చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. అన్నట్లుగానే వర్మ మర్డర్‌ అనే టైటిల్‌తో సినిమాను ప్రకటించడంతో పాటు ఏకంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. వర్మ మర్డర్‌ చిత్రంపై అమృత తీవ్ర మనస్థాపంకు గురై వ్యాఖ్యలు చేసింది.

అమృత మాట్లాడుతూ… రామ్‌ గోపాల్‌ వర్మ పోస్టర్‌ విడుదల చేస్తానంటూ ప్రకటించినప్పటి నుండి భయంతో వణికి పోతున్నాను. కొడుతో కొంతలో కొంత అయినా ప్రశాంతంగా ఉన్న నన్ను మళ్లీ బజారుకు ఈడ్చేలా వర్మ మర్డర్‌ సినిమా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు చనిపోయాడు, కన్న తండ్రి చనిపోయాడు. నా జీవితం తలకిందులు అయ్యింది. నేను ఇప్పటికి చిత్కారాలు ఎదుర్కొంటున్నాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పా.

ఈ కొత్త సమస్యను ఎదిరించేందుకు నా వద్ద శక్తి లేదు. ఏడ్చేందుకు ఇంకా కన్నీళ్లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రామ్‌ గోపాల్‌ వర్మ మా పేర్లతో కథను అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మపై నెటిజన్స్‌ కూడా మండి పడుతున్నారు. ఇలాంటి సినిమాల వల్ల ఎవరికి ప్రయోజనం లేదని, ఒక అమ్మాయి జీవితాన్ని మరింతగా దుర్బరం చేసేందుకు ప్రయత్నించవద్దంటూ సూచిస్తున్నారు. కాని వర్మ మాత్రం ఎవరేం అనుకున్నా కూడా తాను తీసి తీరుతాను అన్నట్లుగానే ముందుకు వెళ్తున్నాడు.

Exit mobile version