ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పునీత్ రాజ్ కుమార్ మరణం పై వర్మ మార్క్ కామెంట్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. టాలీవుడ్ సైతం ఒక్కసారిగ దిగ్భ్రాంతికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి నోట మాట రాలేదని తన ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ కి ఇలా జరగడం పై చిరు కన్నీళ్లు చెమర్చారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఇంకా మోహన్ బాబు సహా టాలీవుడ్ పెద్దలంతా పునిత్ మరణంపై తమ ప్రగాడణ సానుభూతి ప్రకటించారు. అటు బాలీవుడ్…కోలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు పునిత్ హఠాన్మరణంపై షాక్ కి గురైంది.

సోషల్ మీడియాలో వేదికగా హీరోలు..నిర్మాతలు..దర్శకులు..నటీనటులు అంతా సంతాపం ప్రకటించారు. ఇక సంచలనాల రాంగోపాల్ వర్మ మాత్రం మరోసారి తనదైన శైలో స్పందించారు. ఆ షాకింగ్ విషాదం కాకూడదు. పునీత్ రాజ్కుమార్ ‘ఆకస్మిక మరణం మనలో ఎవరైనా ఎప్పుడైనా అలాగే చనిపోవచ్చు. ఎవరు నమ్మినా..నమ్మకపోయినా భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో జీవించడం ఉత్తమం అని వర్మ తనదైన శైలిలో స్పందించారు. వర్మ చెప్పింది కరెక్టే. జీవితం నీటి బుడగలాంటింది. మరణం ఎప్పుడు ఎలా? ఏ రూపంలో మందుకొస్తుందో తెలియదు.

అది ఎలా వచ్చినా దానికి సిద్దంగా ఉండాలి. మరణం చెప్పి రాదు..చెప్పకుండానే వస్తుంది. కాబట్టి ఉన్న జీవితాన్ని ఆస్వాదించాలి..ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. భవిష్యత్ గురించి బెంగొద్దు…వర్తమానం గురించి గజిబిజి వద్దు. గతాన్ని తలుచుకుని బాధపడొద్దు.. అన్నదే వర్మ సిద్దాంతం. ఇవే విషయాల్ని వర్మ ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ మరణం నేపథ్యంలో ఈ విషయాలు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.

Exit mobile version