కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కన్నడ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి కథనం ప్రకారం.. ‘హీరో’ సినిమా షూటింగ్ సందర్బంగా పెట్రోల్ బాంబును హీరో రిషబ్ శెట్టి పైకి విసరాల్సి ఉంటుంది. ఆసమయంలో హీరో పక్కకు జరగాలి. కాని కాస్త ఆలస్యంగా మూవ్ అవ్వడంతో అప్పటికే మంటలు అంటుకుని నిజంగానే పెట్రోలు బాంబు పేలి రిషబ్ కు గాయాలు అయ్యాయి. దాంతో వెంటనే షూటింగ్ ను నిలిపి వేసి స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ సంఘటన హాసన్ జిల్లా బేలూరు లో జరిగినట్లుగా చెబుతున్నారు.