శ్రీనివాస రెడ్డి నవ్వుల సవాల్ అనే కామెడీ షో ను చేస్తూ ఉండేవాడు. ఆ షో డైరెక్టర్ నా రూమ్ పక్కనే ఉండేవాడు. ఒక రోజు ఆయన నన్ను పిలిచి షో చేస్తావా అన్నాడు. నేను ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాను. షూటింగ్ చేస్తూ ఉండగా శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆ సమయంలో నేను షూటింగ్ చేస్తున్న విషయం తెలిసి బయటకు వెళ్లి పోయాడు. ఆ తర్వాత నేను చేస్తున్న షో నీకు ఎవరు ఇచ్చారు.. యాంకర్ ను మార్చుతున్న సంగతి వారు నాకు చెప్పలేదు. కనీసం నువ్వు అయినా చెప్పాలి కదా అంటూ నాతో ఆయన అన్న మాటలు చాలా గిల్టీగా అనిపించింది. అప్పటి నుండి ఆ గిల్టీ అలాగే ఉంది.