ఇక వీడియో ఆఖర్లో అసలైన మ్యాటర్ ఉంది. రాజమౌళి హీరోస్ రెడీ అనగానే ఒకరు గుర్రంపై, మరొకరు బులెట్ పై వస్తోన్న వీడియోను బ్లర్ చేసి చూపించడం అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ను ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక అక్టోబర్ 22న దసరా సందర్భంగా కొమరం భీమ్ వీడియోను విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ విజువల్స్ ను చూపించనున్నారు. మరి ఈ వీడియో ఎంతటి సంచలనం అవుతుందో చూడాలి.
ఇక ఆర్ ఆర్ ఆర్ షూట్ మరో రెండు నెలలు హైదరాబాద్ లోనే జరగనుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా షూట్ లో పాల్గొంటున్నట్లు తాజా వీడియో ద్వారా అర్ధమైంది.