ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

గంగూభాయ్ కోసం ఆర్ఆర్ఆర్ సీత కసరత్తులు

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా చరణ్ కు పెయిర్ గా సీత పాత్రలో అలియా మెరవనుంది. ఈ సినిమా కాకుండా బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు చేస్తోంది అలియా భట్.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసింది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం గంగూబాయి కతియావాడీ. ఈ సినిమా కోసం అలియా భట్ తీవ్రంగా శ్రమిస్తోందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే ఈ సినిమాకు సంబంధించి రెండు భారీ పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. అయితే ఆ పాటల చిత్రీకరణకు ముందు అలియా భట్ కు రెండు వారాల బ్రేక్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ బ్రేక్ ను ఆమె సాంగ్ కు సన్నద్ధమవడం కోసం ఉపయోగించుకుంటోంది. డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటోంది.

ఒక పాటలో అయితే దాదాపు 200 బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లతో చిత్రీకరిస్తారట. భారీ హంగుల మధ్య తెరకెక్కే ఈ పాటల కోసం అలియా చెమటోడుస్తోందని తెలుస్తోంది.

Exit mobile version