ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

RRR: థియేట్రికల్ రిలీజైన 70 – 100 రోజుల తర్వాతే ఓటీటీలోకి..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ”ఆర్.ఆర్.ఆర్” చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పలు భారతీయ భాషలతో పాటుగా ఇంగ్లిష్ – పోర్చుగీస్ – కొరియన్ – టర్కిష్ – స్పానిష్ వంటి ఐదు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. RRR సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్ – శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ సంస్థ దాదాపు పది భాషల మూవీ రైట్స్ ని అమ్మింది. ఆ వివరాలను పెన్ స్టూడియోస్ వారు స్వయంగా వెల్లడించారు.

హిందీతో పాటుగా విదేశీ భాషలకి చెందిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలకి చెందిన డిజిటల్ రైట్స్ జీ5 దక్కించుకుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీ శాటిలైట్ హక్కులు ‘జీ సినిమా’ సొంతం చేసుకోగా.. దక్షిణాది భాషల రైట్స్ స్టార్ గ్రూప్ వారు చేజిక్కించుకున్నారు. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ డీల్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా థియేట్రికల్ రిలీజైన 70 – 100 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయాలని ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ – ఒలివియా మోర్రిస్ హీరోయిన్లు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ – సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 1920 నేపథ్యంలో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కితోంది. నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version