ప్రస్తుతానికి విడుదల తేదీ గురించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. షూట్ పూర్తయిన తర్వాత RRR బృందం మీడియాకి అసలు వివరాల్ని వెల్లడిస్తుందని సమాచారం. ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు. హిందీ మార్కెట్ రేంజుకు తగ్గట్టే ప్రతిదీ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు RRR అక్టోబర్ 13 న ప్లాన్ ప్రకారం విడుదలవుతుందా లేదా? అన్నదానిపైనా మీడియా సమావేశంలో వెల్లడించే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సన్నివేశంలో దసరాకి వీలుపడకపోతే క్రిస్మస్ కానీ సంక్రాంతి కి కానీ ఆర్.ఆర్.ఆర్ రిలీజైనా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల అనేక ఇతర తేదీలపైనా ఆరాలు సాగుతున్నాయట. అయితే దీనికి కారణం కోవిడ్ థర్డ్ వేవ్ అని ఓ గుసగుస వినిపిస్తోంది. ఇవన్నీ భారతదేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేదానిపై ఆధారపడి ఉంటాయి.
RRR ఓవర్సీస్ హక్కులు కూడా రికార్డు ధరలకు విక్రయించనున్నారని గుసగుస వినిపిస్తోంది. RRR గ్రాండ్ రిలీజ్ కోసం అన్ని అంతర్జాతీయ దేశాలు అనుకూలంగా ఉండాలి. అన్నిచోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. అప్పుడు మాత్రమే రిటర్న్ లు వెనక్కి తేగలరు. ఇక ఆర్.ఆర్.ఆర్ చివరి షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ ను డివివి ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది.
ఎంఇకే తో పాటు RRR మినీ ప్రోమో?
ఎన్టీఆర్ `ఎవరు మీలో కోటేశ్వరులు` అనే టీవీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం జెమిని టీవీలో ప్రసారమవుతుంది. ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్నారు. ఆగస్టు 22 న ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మొదటి అతిథిగా రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ ప్రత్యేక ప్రోమోను చిత్ర నిర్మాతలు ఎంఇకే షోలో ప్రసారం చేయనున్నట్లు కూడా కథనాస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎపిసోడ్ RRR ప్రచారానికి ప్రధాన అస్త్రంగా మారుతుందని కూడా భావిస్తున్నారు.
పాన్ ఇండియా కాంపిటీషన్ పీక్స్
ప్రస్తుతం పాన్ ఇండియా వార్ సౌత్ లో పీక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి 1 .. బాహుబలి 2.. సాహో చిత్రాలతో కుంపటి రాజుకుంది. భారీ మల్టీస్టారర్లు పోటీపడుతున్నారు. వందల కోట్ల పెట్టుబడులతో బహుభాషల్లో సినిమాలు తీసి రిలీజ్ చేసేందుకు ప్రయత్నించడం అనూహ్య పరిణామం.
ఇక ఇప్పటికే RRR సంచలనాలు నమోదు చేయడం ఖాయమని అంచనా ఏర్పడింది. ఇప్పటికే చిత్రబృందం దోస్తీ సాంగ్ తో ప్రచారాన్ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఇకపైనా ప్రచారంలో హంగామా కొనసాగనుంది. ఆర్.ఆర్.ఆర్ దసరా రిలీజ్ అన్న ప్రచారం సాగుతుండగా..దీనికి పోటీగా మరో పాన్ ఇండియా చిత్రం బరిలో దిగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ ని టార్గెట్ పెట్టుకుని ఐకాన్ స్టార్ బన్ని బరిలో దిగిపోతున్నాడని ఇటీవల కథనాలొచ్చాయి.
`అలవైకుంఠపురములో` సినిమాని `సరిలేరునీకెవ్వరు`ని మించి హిట్ చేయాలని ట్రై చేసిన బన్నీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా దిగుతాడట. అసలు తగ్గేదేలే అంటూ పుష్ప చిత్రాన్ని ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా దించేందుకు టార్గెట్ పెట్టుకున్నాడంటూ ప్రచారమైంది. అయితే కన్ఫామ్ గా దసరా బరిలో ఆర్.ఆర్.ఆర్ వస్తుందంటనే ఈ పోటీ. లేదా పుష్ప చాలా ముందే రిలీజయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.