ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆర్ ఆర్ ఆర్ ట్రయిల్ షూట్ కూడా వాయిదా పడినట్లేనా?

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడిన విషయం తెల్సిందే. దాదాపు మూడు నెలలకు పైగా షూటింగ్ సాగకపోవడంతో విడుదల కూడా వాయిదా పడిన విషయం తెల్సిందే. ముందు జనవరి 8న విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది సమ్మర్ కు వాయిదా పడినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే షూటింగ్ కు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి కూడా తెల్సిందే. ముందుగా రాజమౌళి రెండు రోజుల పాటు ట్రయిల్ షూట్ కు ప్లాన్ చేసారు. వచ్చే వారం ఈ షూట్ ను ప్లాన్ చేసారు. అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల నుండి షూటింగ్ మొదలుపెట్టొచ్చు అన్నది రాజమౌళి ఆలోచన.

అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. తెలంగాణలో అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టెస్ట్ షూట్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందు ఈ కేసులు తగ్గాకనే షూటింగ్ గురించి ఆలోచిద్దామని ఆర్ ఆర్ ఆర్ టీమ్ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయడం అంత శ్రేయస్కరం కాదన్నది వారి భావన.

Exit mobile version