ఎట్టకేలకు రాజమౌళికి షూటింగ్ కోసం అనుమతులు వచ్చాయి. ఈనెల 25వ తారీకు నుండి రాజమౌళి గండిపేట ఏరియాలో చిత్రీకరణ ఏర్పాట్లు చేస్తున్నాడు. మొదటి రెండు మూడు రోజులు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. మొదట కీలక నటీనటులతో రాజమౌళి చిత్రీకరణ చేస్తున్నాడు. అతి కొద్ది మంది సాంకేతిక నిపుణులు అవసరం అయినంత వరకే నటీనటులు సెట్ లో ఉండేలా రాజమౌళి చర్యలు తీసుకోనున్నాడు.
జక్కన్న సినిమా అంటే సెట్ లో వందల సంఖ్యలో యూనిట్ సభ్యులు ఉంటారు. కాని ఈసారి మాత్రం తన రెగ్యులర్ పంథాకు విభిన్నంగా జక్కన్న షూటింగ్ చేయబోతున్నాడు. పీపీఈ కిట్స్ తో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మరీ షూటింగ్ కు రాజమౌళి వెళ్లబోతున్నాడు. దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మరియు హాలీవుడ్ హీరోయిన్ ఒలివియాలు నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాను వచ్చే ఏడాది జులై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.