పెద్ద ఎత్తున విడుదల కోసం రెడీ అవుతున్న ఈ సినిమా లో ఛారిత్రాత్మక హీరోలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో కోర్టు కు అల్లూరి ని బ్రిటీష్ పోలీస్ గా చూపించబోతున్నట్లుగా రాజమౌళి ఇప్పటికే చెప్పుకొచ్చారు. కనుక అల్లూరిని ఎలా బ్రిటీష్ పోలీసుగా చూపిస్తారు అంటూ కోర్టు లో వ్యాజ్యం దాఖలు అయ్యింది. బ్రిటీష్ వారి కి ధీటుగా పోరాటం చేసిన అల్లూరిని బ్రిటీష్ పోలీస్ గా ఎలా చూపిస్తారు అంటూ పిటీషనర్ కోర్టు ద్వారా రాజమౌళిని ప్రశ్నించాడు.