ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రాజమౌళి ని ‘నాన్ ఎస్.ఎస్ ఆర్’ అనేసిన నిర్మాత!

పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అమెరికాలో ప్రీమియర్ షోలతోనే 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించింది. ఇంకా ఆ లెక్క పెరిగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ర్టాల్లో చరణ్..తారక్ ఇమేజ్ తో `ఆర్ ఆర్ ఆర్` కి తిరుగుండదు. కొన్ని రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద హీరోలిద్దరి హవా కొనసాగుతుంది. ఇక రివ్యూలన్నీ పాజిటివ్ గా వచ్చాయి.

దీంతో ఫ్యాన్స్ ఖుషీ. వెండి తెరపై చరణ్..తారక్ ని చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు. ఇలా కొన్ని లెక్కల్ని బేరీజు వేసుకునే `బాహుబలి` ప్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ జక్కన్న మేథస్ ని ఉద్దేశించి `నాన్ ఎస్ ఎస్ ఆర్` రికార్డులు అని ముందుగానే కీర్తించారు. తొలుత `నాన్ ఆర్ ఆర్ ఆర్` అని ప్రతిపాదించి ఆ తర్వాత ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళికే దక్కేలా `నాన్ ఎస్ ఎస్ ఆర్` అని మార్పు చేసారు.

ట్వీటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసారు. అంటే రాజమౌళి సినిమా రికార్డులు ఆయనకు ఆయనే బ్రేక్ చేయాలి. ఇంకెవరికి సాధ్యం కాదు అన్న మీనింగ్ తో ఈ ట్వీట్ వైరల్ గామారింది. ఇప్పటివరకూ బాక్సాఫీస్ రికార్డుల గురించి మాట్లాడితే `నాన్ బాహుబలి` అని అనే వారు.

ఇకపై `నాన్ బాహుబలి`కి బధులుగా `ఆర్ ఆర్ ఆర్` కూడా భారీగా వసూళ్లని సాధిస్తే `నాన్ ఎస్ ఎస్ ఆర్` గానే పిలవాల్సి ఉంటుందేమో. అయితే అదంత వీజీ కాదు. `ఆర్ ఆర్ ఆర్` -`బాహుబలి` రేంజ్ రికార్డులను అందుకుంటుందా? అన్న ప్రశ్నకు మెజార్టీ వర్గం పెదవి విరిచేస్తుంది.

`బాహుబలి` రేంజ్ సినిమా కాదని…ఆ స్థాయి వసూళ్లను రాబట్టడం అంత వీజీ కాదని అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది ఆ ఫీట్ సాధిస్తుందని అంటున్నారు. మరి ఏది నిజమవుతుందో ఇంకొన్నాళ్లు ఆగితే గాని సంగతేంటి?

అన్నది తెలియదు. అయితే శోభు యార్లగడ్డ ముందు `నాన్ ఆర్ ఆర్ ఆర్` అనడం ఇష్టం లేక..`బాహుబలి`ని తక్కువ చేయలేక `నాన్ ఎస్ ఎస్ ఆర్` అని మార్చినట్లు కొంతమంది చెప్పుకొస్తున్నారు. కారణాలు ఏవైనా ఇదంతా `బాహుబలి` రికార్డులు తిరగరాసిన తర్వాత డిస్కస్ చేయాల్సిన అంశం. అప్పటివరకూ అతి అవసరం లేదు కదా.

Exit mobile version