Advertisement

#సాయి తేజ్.. జాతకం ముందే చెప్పినా జాగ్రత్త పడలేదా!

Posted : September 12, 2021 at 6:57 pm IST by ManaTeluguMovies

నాస్తికులు జ్యోతిష్యాన్ని నమ్మరు. జ్యోశ్యం ప్రకారం ముందే అన్నీ తెలిసిపోతే ఇక జరగాల్సినవేవీ జరగకూడదు కదా! అని అంటారు. అయితే ముందే తెలిస్తే వాటికి శాంతులు ఉపశాంతులు అనేవి ఉంటాయి! వాటి ద్వారా ఉపశమనం పొందచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు.

అయితే ప్రతిసారీ సామాన్యులకు ఏదైనా అయినా పెద్దగా జ్యోతిష్యం గురించిన ప్రస్థావన ఉండదు కానీ సెలబ్రిటీలకు ఏం జరిగినా జ్యోతిష్కులు చెలరేగుతారు. ముందే చెప్పిందే జరిగిందని అంటారు. ఇంతకుముందు సౌందర్య హెలీకాఫ్టర్ దృష్టాంతం.. ఆ తర్వాత శ్రీదేవి వ్యవహారంలోనూ ఇలాగే చెప్పారు. కానీ జరగాల్సింది జరిగిపోయాక జ్యోశ్యం ఏం చెప్పినా ప్రయోజనం లేదని ప్రూవైంది.

ఇప్పుడు సాయి ధరమ్ జాతకంలో ప్రమాదం ఊహించినదే అంటూ ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జ్యోతిష్కుడు ముందే చెప్పారని అయితే దానిని నమ్మిన ఆస్తికుడైన సాయి తేజ్ ఉపశాంతులు చేయించే ఆలోచనలో ఉన్నారని ఈలోగానే ఇలా రోడ్ ప్రమాదం జరిగిందని ఓ కథనం. కీడును ముందే ఊహించిన జ్యోతిష్కుడు రోడ్ ప్రమాదం జరగొచ్చని సూచించాకా అతడు దానిని పట్టించుకోకే ఇది జరిగిందనేది దాని సారాంశం. ఇక అదృష్టవశాత్తూ సాయితేజ్ ప్రమాదం నుంచి సురక్షితుడయ్యారు. నెమ్మదిగా కోలుకుంటున్నారు.

నిజానికి కొన్ని కథనాలు ఎప్పుడూ వినేందుకు లేదా చదివేందుకు ఎంతో అందంగా ఉంటాయి. కానీ ప్రాక్టికల్ గా మాత్రం ప్రమాదాన్ని ఆపలేవనే ప్రూవ్ అయ్యింది. రోడ్లపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కనీసం ఒకటి కాకపోతే ఇంకొకటి అయినా ఆపాలి. ఇంతకుముందు నందమూరి హరికృష్ణ కార్ యాక్సిడెంట్ .. అంతకుముందు జానికి రామ్ యాక్సిడెంట్ ఇవేవీ ఆగలేదు కదా..! జ్యోతిష్యం పని చేస్తోందో లేదో చెప్పే బుర్రలేవీ ప్రస్తుతానికి అంతుచిక్కడం లేదని ఒక సెక్షన్ ప్రజానీకం విశ్లేస్తున్నారు. దీనికి జ్యోతిష్యులు ఏమని అంటారో కానీ!!


Advertisement

Recent Random Post:

పీలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్ | Deputy CM Pawan Kalyan

Posted : December 1, 2024 at 8:29 pm IST by ManaTeluguMovies

పీలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్ | Deputy CM Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad