మూడు సంవత్సరాల క్రితమే వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు వీరు పోట్లకు సాయి ధరమ్ తేజ్ డేట్లు ఇచ్చాడు. గతంలో ప్రామిస్ ఇచ్చిన కారణంగా ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరు పోట్ల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అందుకు సంబంధంచిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.
ఈతరం ప్రేక్షకులకు బాలకృష్ణ ఆధిత్య 369 సినిమాలో చేసిన శ్రీకృష్ణ దేవరాయ పాత్ర మాత్రమే గుర్తుకు వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ ఆపాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ పాత్రకు ఎంత వరకు సాయి ధరమ్ తేజ్ న్యాయం చేస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా హీరోల్లో ఈతరంకు చెందిన వారు ఎవరు కూడా పౌరాణిక సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. మొదటిసారి తేజూ సిద్దం అయ్యాడు.