Advertisement

బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పబోతున్న మెగా హీరో

Posted : May 12, 2020 at 12:00 pm IST by ManaTeluguMovies

మెగా బ్రదర్స్‌ మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే చిత్రంతో మే 1న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కొన్ని కరోనా కారణంగా సినిమా ఆగిపోయింది. దాదాపుగా షూటింగ్‌ పూర్తి అయిన సోలో బ్రతుకే సోబెటర్‌ చిత్రం ప్రమోషన్స్‌ కూడా ప్రారంభించిన తర్వాత లాక్‌ డౌన్‌ విధించడంతో సైలెంట్‌ అయ్యారు. సినిమాలో సోలో బ్రతుకే సో బెటర్‌ అంటున్న సాయి ధరమ్‌ తేజ్‌ రియల్‌ లైఫ్‌ లో మాత్రం సోలో బ్రతుకుకు గుడ్‌ బై చెప్పేందుకు సిద్దం అయ్యాడట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లి పీఠలు ఎక్కే అవకాశం ఉందంటున్నారు. 35 ఏళ్ల వయసు ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ అమ్మాయినే కుటుంబ సభ్యుల ఒప్పందంతో పెళ్లి చేసుకునేందుకు తేజ్‌ రెడీ అవుతున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లి విషయంలో మెగా కాంపౌండ్‌ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. కాని మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సోబెటర్‌’ చిత్రం తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్‌ డ్రామా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. లాక్‌డౌన్‌ లేకుండా ఉన్నట్లయితే ఇప్పటికే షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యి ఉండేది. దేవా కట్టా తర్వాత తేజ్‌ చేయబోతున్న చిత్రం కూడా దాదాపుగా ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. వరుసగా చిత్రాలు చేస్తూనే తేజ్‌ పెళ్లికి కూడా రెడీ అవుతున్నాడు. మరికొన్ని నెలల్లో తేజ్‌ పెళ్లికి సంబంధించి మెగా ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 : రొటీన్ కు భిన్నంగా జగన్ ప్రచారం | CM Jagan Election Campaign | YSRCP

Posted : April 20, 2024 at 11:39 am IST by ManaTeluguMovies

AP Elections 2024 : రొటీన్ కు భిన్నంగా జగన్ ప్రచారం | CM Jagan Election Campaign | YSRCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement