Advertisement

స్టార్ డైరెక్టర్ కూతురు ‘గని’తో పాస్

Posted : February 9, 2022 at 12:46 pm IST by ManaTeluguMovies

వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మించిన సినిమా ‘గని’. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల కాబోతున్న గని సినిమా నుండి రోమియో జూలియట్ పాట విడుదల అయ్యింది. ఈమద్య కాలంలో థమన్ జోరు కొనసాగుతుంది. ఈ సినిమాకు కూడా ఆయన సంగీతం అందించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

రోమియో జూలియట్ పాట విడుదల గురించి ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు పాట వస్తుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు సినిమా నుండి పాట విడుదల అయ్యింది. ఆ పాట యొక్క ప్రత్యేకత ఏంటీ అంటే స్టార్ లెజెండ్రీ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ పాడారు. ఆమె మొదటి సారి ఈ పాటతో తన కెరీర్ ను సింగర్ గా ఆరంభించారు. ఇండస్ట్రీలో సింగర్ గా ఆమె అడుగు పెట్టాలని చాలా కాలంగా వెయిట్ చేస్తుండగా థమన్ ద్వారా ఆ అవకాశం వచ్చిందట. ఆ విషయాన్ని అదితి చెప్పుకొచ్చింది.

తనకు దక్కిన మంచి అవకాశం ను సద్వినియోగం చేసుకుంటాను అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు అందరికి హామీ ఇచ్చింది. అన్నట్లుగానే గని సినిమాలోని రోమియో జూలియట్ పాటను చక్కగా పాడింది. తాజాగా విడుదల అయిన ఈ పాటలో అదితి శంకర్ గొంతు మాత్రమే వినడం కాకుండా ఆమెను చూడటం కూడా జరిగింది. ఆమె డాన్స్ స్టెప్పులు వేస్తూ పాట పాడిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

శంకర్ కూతురు పాడిన పాట అవ్వడం వల్ల కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ సినీ అభిమానులు ఇతర భాషల్లో ఉన్న శంకర్ అభిమానులు కూడా ఈ రోమియో జూలియట్ పాటను వింటున్నారు. భాష రాకున్నా కూడా శంకర్ కూతురు వాయిస్ ఎలా ఉంది అని తెలుసుకునేందుకు కూడా చాలా మంది పాట వింటూ ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొదటి పాట తో అదితి శంకర్ పాస్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ ఆమె నుండి చక్కని ఔట్ పుట్ తీసుకున్నాడు. కేవలం తన గాత్రం తోనే కాకుండా తన అందంతో కూడా పాటలో మెప్పించింది. అదితి సింగర్ గా కాదు హీరోయిన్ గా రావాలంటూ చాలా మంది ఈ వీడియోను చూసిన తర్వాత కోరుకుంటున్నారు. డాక్టర్ అయిన అదితి శంకర్ యాక్టర్ కూడా అయితే బాగుంటుందని.. ఆమె అందంకు ఖచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరి ఆ ఉద్దేశ్యం ఆమెకు ఉందా.. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసే ఇంట్రెస్ట్ శంకర్ కు ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అదితి శంకర్ ఇండస్ట్రీలో రోమియో జూలియట్ అంటూ అడుగు పెట్టి పాస్ అయింది.


Advertisement

Recent Random Post:

Alitho Saradaga Latest Promo | Season-2 | Murali Mohan (Actor) | 2nd April 2024

Posted : March 27, 2024 at 5:13 pm IST by ManaTeluguMovies

Alitho Saradaga Latest Promo | Season-2 | Murali Mohan (Actor) | 2nd April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement