Advertisement

మెగా హీరో సినిమా కోసం ‘రోబో’ శంకర్ కుమార్తె

Posted : February 5, 2022 at 5:59 pm IST by ManaTeluguMovies

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అదుగో ఇదుగో అంటూ గని సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేయడం జరిగింది. మార్చి 4న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజేకర్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో ప్రథాన ఆకర్షణగా సౌత్ హాట్ బ్యూటీ తమన్నా చేసిన ఐటెం సాంగ్ నిలిచింది. ఈ సినిమా స్థాయిని పెంచేందుకు ప్రముఖ స్టార్స్ ఉపేంద్ర మరియు సునీల్ శెట్టిలు ఉన్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సమయంలో సినిమా గురించిన ఒక ఆసక్తికర విషయం సినిమా పై అంచనాలు ఆసక్తి పెంచే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సినిమా నుండి మరో సాంగ్ ను సంగీత దర్శకుడు థమన్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఈనెల 8వ తారీకున విడుదల కాబోతున్న ‘గని’ రోమియో జూలియట్ సాంగ్ చాలా స్పెషల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పాటను తమిళంతో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న దిగ్గజ దర్శకుడు శంకర్ కుమార్తె అయిన ఐశ్వర్య శంకర్ పాడారు. డాక్టర్ అయిన ఆమె కు సంగీతం అంటే ఆసక్తి.. ఆ ఆసక్తితో పాటలు పాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆమెతో గని సినిమా కోసం థమన్ రోమియో జూలియట్ అనే పాటను పాడించాడు. ఈ పాటకు ఆమె వాయిస్ చక్కగా సెట్ అయ్యిందని.. తప్పకుండా పాట సినిమాలో ప్రథాన ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.

థమన్ సంగీత దర్శకత్వంలో అవ్వడం వల్లే ఐశ్వర్య శంకర్ ఈ పాట పాడేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే శంకర్ కుటుంబంకు థమన్ కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతోనే ఐశ్వర్యను రిక్వెస్ట్ చేసి థమన్ ఈ పాటను ఆమెతో పాడించినట్లుగా తెలుస్తోంది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో థమన్ నటుడిగా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కూడా శంకర్ తో కలిసి సుదీర్ఘ కాలం థమన్ వర్క్ చేశాడు అనేది టాక్. త్వరలోనే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఒక సినిమాకు కూడా థమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంతగా శంకర్ కు థమన్ సన్నిహితుడు కనుకే గని సినిమాఓలో ఐశ్వర్య శంకర్ సినిమా పాడి ఉంటుంది.


Advertisement

Recent Random Post:

Darling Announcement Glimpse | Priyadarshi | Nabha Natesh | Aswin Raam | Vivek Sagar |Niranjan Reddy

Posted : April 20, 2024 at 5:56 pm IST by ManaTeluguMovies

Darling Announcement Glimpse | Priyadarshi | Nabha Natesh | Aswin Raam | Vivek Sagar |Niranjan Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement