ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సాయిప‌ల్ల‌వి ల‌వ్ ఫెయిల్యూరా?

త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వి ఇటీవ‌ల కాలంలో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. ఒక్కో సినిమాతో టాలీవుడ్ మ‌నిషిగా మారుతున్న సాయిప‌ల్ల‌వి ఏం మాట్లాడినా తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా వింటున్నారు. ఆమె వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త అంశాల‌ను తెలుసుకోవాల‌నే ఆస‌క్తి కూడా అంత‌కంత‌కూ పెరుగుతోంది.

తాను పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల సాయిప‌ల్ల‌వి చేసిన ప్ర‌క‌ట‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.హీరోయిన్‌గా అన‌తి కాలంలోనే విశేష సంఖ్య‌లో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంది…సాయిపల్లవి స్టార్ స్టేటస్ ద‌క్కించుకున్నారు. యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్న‌ సాయిప‌ల్ల‌వి పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని బ‌లంగా నిర్ణ‌యించుకోడానికి గ‌ల కార‌ణాలేంట‌నే విష‌య‌మై ర‌క‌ర‌కాల చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న ప్ర‌క‌ట‌న‌పై సాయిప‌ల్ల‌వి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌న త‌ల్లిదండ్రుల‌ను చ‌క్క‌గా చూసుకునేందుకు పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వెల్ల‌డించారు. సాయిప‌ల్ల‌వి ప్ర‌క‌ట‌న‌పై నెటిజ‌న్లు, సినీ అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఇలాగైతే ఎవ‌రూ పెళ్లి చేసుకోకూడ‌ద‌ని, మ‌రి సాయిప‌ల్ల‌విని వృద్ధాప్యంలో ఎవ‌రు చూసుకుంటారోన‌ని సెటైర్లు విసురుతున్నారు.

వీట‌న్న‌టి కంటే సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లో విఫ‌ల‌మైంద‌ని, దీంతో మ‌గ‌వాళ్ల‌పై ఆమె న‌మ్మ‌కం కోల్పోయింద‌నే స‌రికొత్త వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. దీంతో సాయిప‌ల్ల‌వికి ఎవ‌రెవ‌రు స‌న్నిహిత‌మో, ఇప్పుడు వాళ్ల‌తో ఆమెకు ఎలాంటి సంబంధాలున్నాయ‌నే విష‌యాలు కూడా ఆరా తీస్తుండ‌టం గ‌మ‌నార్హం. సాయిప‌ల్ల‌వి ఏ ఉద్దేశంతో పెళ్లి గురించి విర‌క్తితో మాట్లాడారో తెలియ‌దు కానీ…ఆమెను ఆ మాట మాత్రం నీడ‌లా వెంటాడేలా ఉంది.

Exit mobile version