మీడియాలో ఇష్టానుసారంగా వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ కానే కాదు అంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు పూర్తి కొత్త కథతో సలార్ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించాడు. దాంతో సలార్ సినిమాపై ఉన్న అనుమానాలకు తెర పడ్డట్లయ్యింది. ఇక సలార్ మూవీ విడుదల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ వరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ రెండు విషయాలు కూడా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ లు గా చెప్పుకోవచ్చు.