తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ షేరా కి ఏకంగా సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల వేతనం ఇస్తున్నాడని తేలింది. గతంలో మిస్టర్ ముంబై టైటిల్ని దక్కించుకున్న షేరా బాడీ బిల్డర్. సల్మాన్ ఖాన్ తో 28 సంవత్సరాలుగా షేరా అనుబంధం కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్ వద్ద జీతానికి పని చేస్తున్నా అన్నట్టుగా కాకుండా ఒక స్నేహితుడిగా, కుటుంబ సభ్యుడిగా షేరా వ్యవహరిస్తాడు. షేరా గతంలో మైకేల్ జాక్సన్, విల్ స్మిత్, జాకీ చాన్ ప్రముఖులకు సేవలందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు నెలకు 15 లక్షలు జీతం అని తెలియ జేశాడు. ఏడాదికి రెండు కోట్ల జీతం అందుకుంటున్న అత్యంత ఖరీదైన సెక్యూరిటీ గార్డుగా షేరా రికార్డు నెలకొల్పాడు.