ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

డ్రైవర్ కవితకు సమంత ఇచ్చిన మాట నిలుపుకుంది

సమంత సామ్ జామ్‌ టాక్ షో తో మంచి పేరు దక్కించుకుంది. ఆ షో లో కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి సాయం చేయడంతో పాటు ఇన్సిపిరేషన్‌ గా నిలిచిన వారిని తీసుకు వచ్చి మాట్లాడించడం చేసింది. డ్రైవర్‌ కవిత ను ఒక ఎపిసోడ్ లో తీసుకు వచ్చి ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆటో డ్రైవర్ అయిన కవిత కు తాను కారును ఇస్తానంటూ ఆ షో లో హామీ ఇచ్చింది. ఇన్ని రోజులు డ్రైవర్ కవితకు కారు అందక పోవడంతో సమంత ఇచ్చిన మాట తప్పిందనే విమర్శలు కొందరు వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు సమంత ఇచ్చిన మాట ప్రకారం కవితకు కారును బహుమానంగా ఇచ్చింది. తన సొంత ఖర్చులతో సమంత ఆ కారును కవితకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సమంత మంచి మనసుకు ఇది నిదర్శణం అంటున్నరు. ఖచ్చితంగా సమంత ఇచ్చిన మాట మీద నిలబడుతుందని మరోసారి నిరూపితం అయ్యిందని ఆమె అభిమానులు అంటున్నారు. డ్రైవర్ కవిత తనకు సమంత నుండి కారు వచ్చిందంటూ చాలా సంతోషంగా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

Exit mobile version