ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సమంతకు కరోనా టెన్షన్‌, టెస్ట్‌కు వెళ్లనుందా?

మొన్నటి వరకు వందల్లో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు వేలల్లో నమోదు అవుతున్నాయి. దేశంలోని సెలబ్రెటీలు మరియు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్‌ లో మొదటి కరోనా కేసు బండ్ల గణేష్‌ గా నమోదు అయ్యింది. నిర్మాత బండ్ల గణేష్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌ లో ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు నెగటివ్‌ వచ్చినా కూడా హోం క్వారెంటైన్‌ లో ఉన్నారు. ఇక టాలీవుడ్‌ కు చెందిన మరోకరికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఈసారి ఆమె వల్ల స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా ఆందోళన చెందాల్సి వస్తుంది.

టాలీవుడ్‌ లో పలువురు స్టార్స్‌ కు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా వ్యవహరించి ఫేమస్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా సెలబ్రెటీ హోద కలిగి ఉన్న శిల్ప రెడ్డి ఇటీవల కరోనా పాజిటివ్‌ గా నమోదు అయ్యింది. స్వల్ప అనారోగ్య సమస్యతో ఆమె పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని వైధ్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ లోని ప్రముఖ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

శిల్పను కొన్ని రోజుల క్రితమే సమంత కలిసింది. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలను కూడా సమంత షేర్‌ చేసింది. శిల్పకు ఏకంగా సమంత ముద్దు పెడుతున్న ఫొటో ఆమద్య వైరల్‌ అయ్యింది. ఎక్కువ రోజులు ఏమీ కాలేదు కనుక అప్పటికే శిల్పకు వైరస్‌ ఉండి ఉంటే సమంతకు కూడా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శిల్పకు కరోనా నిర్థారణ అయిన నేపథ్యంలో సమంత కూడా టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. నేడో రేపో సమంత కూడా కరోనా నిర్థారణ టెస్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఆమెతో పాటు నాగచైతన్య కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. ఇద్దరికి కూడా టెస్టు నెగటివ్‌ రావాలని ఇప్పటి నుండే అక్కినేని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Exit mobile version