సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత, పెళ్ళయాక సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో తన పేరుని సమంత అక్కినేనిగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఇందులో మార్పు చేసింది. సమంత అక్కినేని బదులు ఎస్ అని పెట్టుకుంది.
అయితే దీని వెనుక కారణం తెలియలేదు. సాధారణంగానే మార్చిందా లేక ఏదైనా ప్రమోషన్ లో భాగంగా అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్ పరంగా సమంత హ్యాపీ ఫేజ్ లో ఉంది, ది ఫ్యామిలీ మ్యాన్ 2 సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం శాకుంతలం ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది సమంత.