Advertisement

అక్కినేని ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సమంత..!

Posted : November 24, 2021 at 12:06 pm IST by ManaTeluguMovies

అక్కినేని నాగ చైతన్య నిన్న మంగళవారం తన 35వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు శ్రేయోభిలాషులు చైతూకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందజేశారు. యువసామ్రాట్ కామన్ డీపీతో నెట్టింట సందడి చేసిన అభిమానులు.. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి తమ ఫేవరేట్ హీరో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

వీరి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి చైతూ ప్రస్తుతం నటిస్తున్న ‘బంగార్రాజు’ ‘థాంక్యూ’ సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఈ సర్ప్రైజుల పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నా.. సమంత సోషల్ మీడియాలో చై కి విష్ చేయకపోవడంపై నిరాశ చెందారని తెలుస్తోంది.

ఇటీవల నాగ చైతన్య- సమంత తమ ఏడేళ్ల ప్రేమకు నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇకపై వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తామని.. స్నేహితులుగా కొనసాగుతాని ప్రకటించారు. చై-సామ్ విడాకులు ప్రకటన విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

విడిపోయినా తాము ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని చెప్పడంతో.. చైతన్య పుట్టినరోజుకు సామ్ శుభాకాంక్షలు తెలియజేస్తుందని అందరూ భావించారు. గతేడాది చై బర్త్ డే ను సమంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఈసారి సోషల్ మీడియా వేదికగానైనా చైతూ కి విషెస్ అందిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

చై-సామ్ మధ్య విభేదాలు వచ్చిన సమయంలోనే అక్కినేని నాగార్జున పుట్టినరోజుకు ‘నాగ్ మామా’ అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. నాగార్జున సైతం సమంత తమ ఫ్యామిలీకి ఎప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పారు. అందుకే నాగచైతన్య కు విషెస్ చెబుతుందని ఫ్యాన్స్ భావించారు.

కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సామ్.. చై ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. కానీ ఈరోజు తన పెట్ డాగ్ హ్యాష్ బర్త్ డే కు సన్నిహితులు విష్ చేయడాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పెళ్ళైన కొత్తలో చై-సామ్ తెచ్చుకున్న డాగ్ ‘హ్యాష్’. వీరు విడిపోయిన తర్వాత సమంత దగ్గరే ఉంటుంది.

ఇద్దరు కలిసి పెంచుకున్న డాగ్ పుట్టినరోజును గుర్తు చేసుకొని.. చైతన్య బర్త్ డే ను విస్మరించడమే అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటించినా ఇకపై వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదేమే అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య – సమంత ఇద్దరూ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. ఓవైపు చై రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. ఇక సామ్ ఇప్పుడు రెండు బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనే కోరికను బయటపెట్టింది. ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ ను 3 కోట్లకు పెంచిందని ప్రచారం జరుగుతోంది.


Advertisement

Recent Random Post:

మెడ మీద కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తావా..? l Bandi Sanjay Challenge to CM KCR l

Posted : November 30, 2021 at 2:27 pm IST by ManaTeluguMovies

మెడ మీద కత్తి పెడితే ఫామ్ హౌస్ రాసిస్తావా..? l Bandi Sanjay Challenge to CM KCR l

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement