నాగచైతన్యతో వివాహం జరిగిన కొన్నాళ్లకే ప్రీ స్కూల్ బిజినెస్ లోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది. హైదరాబాద్ సిటీలో ఖరీదైన కాలనీల్లో సమంత స్కూల్స్ ఇప్పటికే వెలిసాయి. ఓ యూనిక్ ఐడియాతో ఈ స్కూల్ బిజినెస్ లోకి సమంత దిగింది. ప్రస్తుతం అవి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాయి. ఆ తర్వాత `సాకీ` అనే బ్రాండ్ తో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. మెట్రోపాలిటన్ సిటీస్ లో సాకీని పెద్ద ఎత్తున విస్తరించే పనుల్లో ఉంది.
తాజాగా సమంత ఓ ఈ కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా చేరింది. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీకి సమంతనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది.
ఈ కంపెనీ మొదలై ఏడాది పూర్తయింది. ఇందులో పర్యావర్ణ రహిత వస్తువుల్ని మాత్రమే అమ్ముతారు. దుస్తులు..ఇంటీరియర్ డెకరేషన్..హెల్త్ ప్రోడక్ట్ లు..సౌందర్య ఉత్పత్తులు ఇలా అన్ని పర్యావరణానికి హాని కల్గించని వాటినే అమ్మకం చేస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో ఆర్గానిక్ ఫుడ్ వైపు జనాలు మళ్లినట్లే…ఈ పర్యావరణ వస్తువుల వ్యాపారం భవిష్యత్ లో బాగుంటుంది.
అందుకే సమంత తెలివిగా ఈ వ్యాపారంలో పెట్టు బడులుపెడుతుంది. ప్రస్తుతానికి ఆన్ లైన్ లోనే క్రయ..విక్రయాలు జరుతున్నాయి. త్వరలోనే అన్ని నగరాల్లోనూ స్టోర్స్ ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ నాటికి మొదటి స్టోర్ లాంచ్ అవుతుందని సమాచారం. మొత్తానికి సమంత తెలివైన ప్రణాళికలతోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇటీవలే `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. అలాగే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `యశోద` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. తెలుగు..తమిళ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కన్నడ..మలయాళ..హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన `కథువకుల రెండు కాదల్` అనే సినిమాలోనూ నటిస్తోంది. `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తుంది.