నాకు అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన అభిమానుల కోసమే నేను సినిమాలు చేస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. నచ్చినవి చేసుకుంటూ వెళుతున్నాను అని సామ్ తెలిపారు. పదకొండేళ్లుగా నటిగా బిజీగా ఉండడం నాపై ప్రభావం చూపుతున్నందున ఇప్పుడు నటన నుండి విరామం తీసుకుంటానని తెలిపారు.
నేను ఆందోళన చెందితే అది చైతన్య గురించి అతడి సినిమాల గురించి. చై నటించిన లవ్ స్టోరి రిలీజ్ గురించి ఆలోచిస్తున్నాను. నా సినిమాల విడుదలల గురించి అలాగే చైతన్య గురించి నేను ఆందోళన చెందుతున్నాను.. ఆత్రుతగా ఉన్నాను అని సామ్ అన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో సమంత తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను నటించిన `ఫ్యామిలీ మ్యాన్ 2`లో రాజీ పాత్ర వివాదాస్పదమైంది. ఆ పాత్ర ప్రజల మనోభావాలను కించపరిస్తే అందుకు క్షమాపణలు. నిజానికి ఇది ఉద్ధేశ పూర్వకంగా చేసిన పాత్ర కానే కాదని వివరణ ఇచ్చారు.
సమంత అక్కినేని కెరీర్ గ్రాఫ్ గురించి చెప్పాలంటే… తదుపరి పౌరాణిక చిత్రం శాకుంతలంలో కనిపించనుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. ఈ చిత్రం మహాకవి కాళిదాసు రాసిన `అభిజ్ఞాన శాకుంతలం` అనే ప్రాచీన నాటకం ఆధారంగా రూపొందించినది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా క్రైసిస్ కష్ట కాలంలో ప్రారంభమైనా అత్యంత వేగంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. ఇటీవలే గుమ్మడి కాయ కార్యక్రమంలో సమంత..అర్హ-గుణశేఖర్ టీమ్ సందడి చేశారు. అలాగే నయనతార- విఘ్నేష్- సేతుపతి ల తమిళ చిత్రంలోనూ సమంత ఒక కథానాయికగా నటిస్తోంది. భర్త చైతన్యతో కలిసి మజిలీ తరహాలో మరో సినిమాలో నటించేందుకు సమంత సన్నాహకాల్లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సస్ తర్వాత నెట్ ఫ్లిక్స్ తో భారీ వెబ్ సిరీస్ కోసం డీల్ కి సంతకం చేశారన్న ప్రచారం ఉంది.